సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు..పిక్స్ వైరల్

సాయి పల్లవి ఇంట పెళ్లి వేడుకలు..పిక్స్ వైరల్

Published on Jan 24, 2024 4:10 PM IST


మన టాలీవుడ్ సినిమా దగ్గర మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో నాచురల్ పెర్ఫార్మర్ సాయి పల్లవి కూడా ఒకరు. మరి సాయి పల్లవి హీరోయిన్ గా సెట్ అయ్యాక ఆమె అందులోనే బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె పెళ్ళి, లవ్ లాంటివి ఉన్నాయా అంటూ చాలానే ప్రశ్నలు వచ్చాయి కానీ అలాంటివి ఏమి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

అయితే ఫైనల్ గా ఇప్పుడు సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. కానీ ఇక్కడ పెళ్లి తనకి కాదు తన చెల్లెలు పూజా కన్నన్ పెళ్లి ఫిక్స్ అయ్యింది. అయితే రీసెంట్ గానే తన ఎంగేజ్మెంట్ కూడా జరుగగా ఇప్పుడు దానికి సంబంధించిన ఫోటోలు వార్తల్లోకి వచ్చాయి. వినీత్ అనే యువకుడితో ఈ జనవరి 21న ఎంగేజ్మెంట్ కాగా ఈ హ్యాపీ మూమెంట్స్ కి సంబంధిచిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు