షూటింగ్ పూర్తి చేసుకున్న “మార్షల్” !

marshall

పబ్లిక్ స్టార్ శ్రీకాంత్ విభిన్న పాత్ర పోషిస్తుండగా అభయ్ హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మార్షల్”. ఏ వి ఎల్ ప్రొడక్షన్స్ పతాకంపై జై రాజ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేఘ చౌదరి హీరొయిన్ గా నటిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.

దర్శకుడు జై రాజ సింగ్ మాట్లాడుతూ.. హీరో అభయ్ అడకా పాత్ర ఎంతో హుందాగా, నూతనంగా ఉంటుందని వివరించారు. సినీ హీరో శ్రీకాంత్ ఈ సినిమాలో ఒక మరచిపోలేని పాత్రకు ప్రాణం పోశారని చెప్పారు.

నిర్మాత అభయ్ అడకా మాట్లాడుతూ వైవిద్యభరితమైన చిత్రం మార్షల్ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేశాం ఇది అందరికీ నచ్చుతుంది. త్వరలొనె పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకువస్తామన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యాదగిరి వరికుప్పల, ఛాయాగ్రాహకుడు : స్వామి ఆర్ యమ్, మాటలు : ప్రవీణ్ కుమార్ బొట్ల, ఎడిటర్ : చోట కె ప్రసాద్, నిర్మాత : అభయ్ అడకా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : జై రాజ సింగ్.

Exit mobile version