ప్రభాస్ కోసం మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్స్ !

ప్రభాస్ కోసం మార్షల్ ఆర్ట్స్ సీక్వెన్స్ !

Published on Feb 27, 2021 10:05 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల ప్రాజెక్ట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు మొదటినుండీ కాస్త ఎక్కువ ఆసక్తి ఉంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ డాన్స్, జమ్నాస్టిక్స్ తెలిసి, 9-14 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు కావాలంటూ ఒక ప్రకటన ఇచ్చాడు. కాగా జమ్నాస్టిక్స్ తెలిసిన అమ్మాయిలను ఇరవైమంది వరకూ సెలెక్ట్ చేశారట. మొత్తానికి ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ సీన్స్ ఉండబోతున్నాయన్నమాట.

కాగా ఈ సినిమాలో ప్రభాస్’కి అమ్మగా సీనియర్ స్టార్ హీరోయిన్ ‘రేఖ’ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో అమితాబ్ కూడా నటిస్తున్నారు. అమితాబ్ కి భార్యగానే రేఖను తీసుకున్నారని.. వీరిద్దరిది హాట్ పెయిర్ కాబట్టి.. ఆ రకంగా సినిమాకి బాగా ప్లస్ అవుతుందని నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ చేశాడట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా నేపథ్యం మొత్తం ఓ దీవిలో జరుగుతుందని.. ఆ దివి తాలూకు సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని, ప్రభాస్ గెటప్ కొత్తగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు