ఎన్టీఆర్ “దేవర” తో క్లాష్ కి సిద్ధమైన పాన్ ఇండియా మూవీ!

ఎన్టీఆర్ “దేవర” తో క్లాష్ కి సిద్ధమైన పాన్ ఇండియా మూవీ!

Published on May 28, 2024 11:36 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ను అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే కన్నడ సినీ పరిశ్రమ నుండి ఈ ఏడాది పాన్ ఇండియా మూవీ గా వస్తున్న మార్టిన్ చిత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 11 న వరల్డ్ వైడ్ గా భారతీయ ప్రధాన భాషల్లో రిలీజ్ కానుంది. ఇది దేవర తో గట్టి క్లాష్ కి రెడీ అయినట్లు తెలుస్తొంది. ఈ కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కి ఏ.పీ. అర్జున్ దర్శకత్వం వహించగా, అర్జున్ సర్జా కథని అందించారు. ధృవ సర్జా ఈ చిత్రం లో ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం పై కూడా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దేవర చిత్రం లో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ ఈ చిత్రంకి సంగీతం అందిస్తున్నారు. జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడం తో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు