సంపూర్నేష్ బాబు సినిమాకి మారుతి టీం బ్రాండ్

kobali-motta
‘నేను నరకడం మొదలు పెడితే డ్రైనేజీలు తవ్వడానికి క్రోక్లైనర్లు కావాలి’ అనే డైలాగ్ తో ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న హీరో సంపూర్నేష్ బాబు. చాలా రోజుల తర్వాత పేరడీ తరహా సినిమాలతో దూసుకు వస్తున్న సంపూర్నేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘కొబ్బరి మట్ట’. షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్న ఈ సినిమాలోని మూహూర్తం షాట్ ని ఈ రోజు సంపూర్నేష్ బాబుపై షూట్ చేసారు. ఇదిలా ఉంటే ఇన్ని రోజులు ఈ మూవీ ‘హృదయ కాలేయం’ టీం నుంచి వస్తోంది అన్న బ్రాండ్ మాత్రమే ఉండేది, తాజాగా ఈ సినిమాకి మరో సూపర్ హిట్ బ్యానర్ బ్రాండ్ యాడ్ అయ్యింది.

అదేమిటంటే.. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి టీం బ్రాండ్ నేమ్ ఈ సినిమాకి తోడైంది. హృదయ కాలేయం టీంతో కలిసి మారుతి భాగస్వామి అయిన గుడ్ సినిమా గ్రూప్ వారి సమర్పణలో ఈ సినిమా రిలీజ్ కానుంది. కొబ్బరి మట్ట సినిమాకి గుడ్ సినిమా బ్రాండ్ తోడవడంతో బిజినెస్ బాగా జరుగుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. సంపూర్నేష్ బాబు ‘కొబ్బరి మట్ట’ లో పెదరాయుడు, పాపారాయుడు మరియు ఆండ్రాయిడ్ అనే మూడు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ మూవీలో సంపూ సరసన ఏడుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి రూపక్ రొనాల్డ్ డైరెక్టర్. వెన్నెల కిషోర్ కీ రోల్ చేస్తున్న ఈ మూవీకి కమ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version