టాలీవుడ్ దర్శకుడు మారుతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘ది రాజాసాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను హార్రర్ కామెడీ మూవీగా మారుతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మారుతి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే, ఈ సినిమా తర్వాత మారుతి తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేస్తాడా అనే అంశంపై అప్పుడే సినీ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మారుతి తన నెక్స్ట్ చిత్రాన్ని ఓ మెగా హీరోతో చేయబోతున్నాడనే వార్త జోరుగా వినిపిస్తోంది. అయితే, గతంలో మారుతి సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్‌లతో సినిమాలు చేశాడు. కాగా, ఇప్పుడు మరోసారి సాయి ధరమ్ తేజ్‌తో మారుతి ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడట.
కానీ, ఈ సినిమాకు మారుతి కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటాడని తెలుస్తోంది. ఈ సినిమాను టైగర్ నాగేశ్వర్ రావు ఫేమ్ వంశీ డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే రెడీ అయిందని.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది.
