
‘గోపాల గోపాల’ సినిమా తర్వాత సుమారు 10 నెలలు గ్యాప్ తీసుకొని కెమెరాకి దూరంగా ఉన్న విక్టరీ వెంకటేష్ త్వరలోనే మళ్ళీ కెమెరా ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. ఇటీవలే భలే భలే మగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మారుతి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ సినిమా ఉంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాధా అనే సినిమా అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతం మారుతి వెంకటేష్ కోసం మరో డిఫరెంట్ స్టొరీని సిద్దం చేస్తున్నాడు.
ప్రస్తుతం మారుతి పూర్తి కథని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. అలాగే ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైన తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ సరసన అందాల భామ నయనతార జోడీ కట్టనుంది. నయనతార ఇటీవలే తమిళంలో వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటోంది. అలాగే వెంకీ – నయనతార కాంబినేషన్ లో కూడా తులసి అనే హిట్ ఉండడంతో ఈ కాంబినేషన్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. సురేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.