సాలిడ్ బజ్..అభిజీత్ నుంచి మాస్ అనౌన్సమెంట్స్.?

Published on Mar 6, 2021 3:00 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో ఇప్పటి వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు సీజన్లలో ఏ సీజన్ విన్నర్ కు రాని క్రేజ్ అభిజీత్ కు వచ్చింది. ఇంతకు ముందు వాళ్లకి కూడా వచ్చింది కానీ అది అప్పటికప్పుడు మాత్రమే ఉండి తర్వాత కనుమరుగు అయ్యిపోయింది. కానీ అభిజీత్ కు మాత్రం వేరే లెవెల్లో ఇప్పటికీ ఉంది.

అయితే అంత క్రేజ్ అభిజీత్ తెచ్చుకున్నప్పటికీ పోస్ట్ బిగ్ బాస్ లైఫ్ చేంజ్ అవుతుంది సినిమాలు వస్తాయి అని అనుకున్నారు అంతా..కానీ అభిజీత్ నుంచి అలాంటి సంకేతాలు రాకపోయే సరికి ఆ మాసివ్ అనౌన్సమెంట్స్ ఎప్పుడు వస్తాయా అని అతని ఫాలోవర్స్ ఎదురు చూసారు. కానీ ఇప్పుడు వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చేలా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఒకటి కాదు ఏకంగా మూడు ప్రాజెక్ట్ లకు అభిజీత్ సైన్ చేసినట్టు తెలుస్తుంది. అది కూడా బిగ్ బాస్ సెన్సేషనల్ హోస్ట్ కింగ్ నాగార్జున ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్నట్టు వినిపిస్తుంది. అంతే కాకుండా దీని వెనుక నాగ్ హస్తమే ఉన్నట్టుగా కూడా వినికిడి. మరి దీనిపై ఒక అధికారిక క్లారిటీ వస్తే అభిజీత్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :