మాస్ క్లాస్ మిక్స్ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’ – సతీష్ వేగేశ్న

మాస్ క్లాస్ మిక్స్ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’ – సతీష్ వేగేశ్న

Published on Jan 8, 2020 8:43 PM IST

Satish Vignesh m

ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుగాంచిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఎంత మంచివాడవురా”. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు అభిమానుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ…’ అందరికీ నమస్కారం. నా కెరీర్ లో నాకు సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారికి అతి పెద్ద అభిమాని. ఎంత పెద్ద అభిమాని అంటే.. ఎన్టీఆర్ గారి అభిమాన సంఘానికి మా నాన్నగారు ఉపాధ్యుక్షుడు. ఈ రోజు మా నాన్నగారు ఉండి ఉంటే చాల సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. కళ్యాణ్ రామ్ గారి మాస్ ఫిల్మ్ ‘అతనొక్కడే’.. కళ్యాణ్ రామ్ క్లాస్ మూవీ ‘118’ సినిమాలను కలిపితే మా “ఎంత మంచివాడవురా”. ఈ సినిమా గురించి మిగతా విషయాలు సక్సెస్ మీట్ లో మాట్లాడతాను. సినిమా పై మాకు అంత నమ్మకం ఉంది’ అని అన్నారు.

ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు