
ఇటీవలే ‘కిక్ 2’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న మాస్ మహారాజ్ రవితేజ అప్పుడే తన తదుపరి సినిమా బెంగాల్ టైగర్ ని చివరి దశకు తీసుకొచ్చేసాడు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ యూరప్ లో జరుగుతోంది. అన్ని కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేసి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ ఇటీవలే తన తదుపరి సినిమా ‘ఓ మై ఫ్రెండ్’ ఫేం వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇది వరకే తెలియజేశాం.
ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరక్రియేషన్స్ పై దిల్ రాజు నిర్మించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇటీవలే ఈ టైటిల్ ని దిల్ రాజు ఫిలిం చాంబర్ లో రిజిష్టర్ చేయడానికి కూడా కారణం అదే అని విశ్వసనీయ వరాలు చెబుతున్నాయి. ‘ఎవడో ఒకడు’ అనే టైటిల్ ని బట్టే ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని ఆశించవచ్చు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. రవితేజకి వేణు చెప్పిన కథ, అలాగే అతని పాత్రని తీర్చి దిద్దిన విధానం బాగా నచ్చడంతో ‘బెంగాల్ టైగర్’ పూర్తి కాగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు.

