మెగా హీరో సినిమా కు మాస్ టైటిల్ ?

Published on May 2, 2019 3:42 pm IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్నడని తెలిసిందే. రంగస్థలం కు రైటర్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తన మొదటి చిత్రంలో నటించనున్నాడు వైష్ణవ్ తేజ్. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ కాగా మే నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది

ఇక ఈ చిత్రానికి ‘జాలరి’ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ టైటిల్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ రోల్ లో నటించనున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు మేకర్స్. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించనుండగా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

సంబంధిత సమాచారం :

More