“వకీల్ సాబ్”లో మాస్ ట్రీట్ క్లియర్ గా తెలిసిపోతుందిగా.!

Published on Apr 6, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృఠీ హాసన్ హీరోయిన్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. ఇప్పుడు ఈ సినిమా విడుదల టైం దగ్గర పడుతుండడంతో మేకర్స్ మంచి హై ఈ సినిమాపై తీసుకొస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాను పింక్ కు రీమేక్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కానీ దీనిని పూర్తిగా పవన్ పవర్ లోకి తీసుకొచ్చేసారు అని చెప్పాలి.

అయితే ఒరిజినల్ వెర్షన్ ను కాస్త మాస్ అంశాలు జోడించి తమిళ్ లో అజిత్ తో చేశారు కానీ అంతకు మించిన మాస్ తో తెలుగులో ప్లాన్ చేసినట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. కంటెంట్ కు ఎలా డీల్ చేసారో కానీ పవన్ పై మాత్రం మాస్ ట్రీట్ ఓ రేంజ్ లో ఉండడం కన్ఫర్మ్ అని చెప్పాలి.

మేకర్స్ విడుదల చేస్తున్న పోస్టర్స్ ప్రతీ ఒక్కటి పవన్ అభిమానుల్లో అంచనాలు పెంచేదిలానే ఉంది తప్ప తగ్గేలా లేదు వీటిని బట్టి ఎలా లేదన్నా మాస్ ఆడియెన్స్ కోరుకునే ఎలిమెంట్స్ మాత్రం పవన్ సైడ్ నుంచి పుష్కలంగా ఉండడం ఖాయం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :