“ఓజి” లో ఫైట్ సీక్వెన్స్ లు పట్ల పెరిగిపోతున్న అంచనాలు

“ఓజి” లో ఫైట్ సీక్వెన్స్ లు పట్ల పెరిగిపోతున్న అంచనాలు

Published on May 28, 2024 7:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లో ఒకరకమైన పూనకం వస్తుంది. తాను ఇప్పుడు హీరోగా పొలిటీషియన్ గా కొనసాగుతూ ఉండగా హీరోగా పలు సినిమాలు అయితే చేస్తున్నారు. అయితే పవన్ మల్టీ టాలెంటెడ్ అని అందరికీ తెలిసిందే. మెయిన్ గా తన సినిమాల్లో ఫైట్స్ ని బాగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు.

అయితే మళ్లీ చాలా తర్వాత తన మార్క్ ఫైట్ సీక్వెన్స్ లు అయితే సుజిత్ తో చేస్తున్న భారీ చిత్రం ఓజి లో విట్నెస్ చేయనున్నట్లు ఇది వరకే కన్ఫర్మ్ అయ్యింది. కానీ రీసెంట్ గా సుజిత్ చెప్పిన మాటలతో అసలు పవన్ ఓజి లో ఫైట్ సీక్వెన్స్ లు పట్ల కనబరిచిన ఆసక్తి విని పవన్ అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.

మళ్లీ జానీ తరహాలో లేదా పలు జపనీస్ సినిమాల తరహాలో ఫైట్స్ పవన్ పై ఉంటాయా అన్నట్టు ఫీల్ అవుతూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. దీనితో ఓజి లో ఫైట్ సీన్స్ విషయంలో మాత్రం ఇప్పుడు మామూలు అంచనాలు ఏర్పడలేదు. మరి ఈ సినిమాలో పవన్ ఎలాంటి ట్రీట్ ఇస్తాడో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు