
ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న సినిమా అక్కినేని ఫ్యామిలీ ‘మనం’. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఈ మరికొద్ది సేపట్లో ఈ సినిమా ప్రీమియర్ హైదరాబాద్ లో, ఓవర్సీస్ లో మొదలు కానుంది.
ప్రసాద్ ఐమాక్స్ లోని 5 స్క్రీన్స్ లోనూ రాష్ట్రంలోని సెలక్టివ్ అక్కినేని అభిమానులకు, ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఈ ప్రీమియర్ షో వేస్తున్నారు. దీనికి సంబందించిన అన్ని ఏర్పాట్లు నాగార్జున దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎఎన్ఆర్ కి గుర్తుగా ఆయన ఈ షో వేస్తున్నారు.
మూడు తరాల అక్కినేని హీరోలైన ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.