అజిత్ సినిమాకి మాసివ్ ఓపెనింగ్స్.?

అజిత్ సినిమాకి మాసివ్ ఓపెనింగ్స్.?

Published on Jan 12, 2023 9:00 AM IST

చాలా కాలం తర్వాత కోలీవుడ్ సినిమా దగ్గర భారీ క్లాష్ అయితే చోటు చేసుకుంది. నిన్న జనవరి 11న తమిళ సరిసమాన స్టార్ హీరోలు దళపతి విజయ్ అలాగే అజిత్ కుమార్ లు తమ చిత్రాలు “వారిసు” మరియు “తునివు” చిత్రాలతో తలపడ్డారు. మరి ఇద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ తో తమిళనాట సినిమాలు రిలీజ్ కాగా వసూళ్ల పరంగా మాత్రం డే 1 అజిత్ సినిమాకి మాసివ్ ఓపెనింగ్స్ దక్కినట్టుగా తమిళ ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నాయి.

అయితే రెండు ఉన్నప్పటికీ తమిళ్ లో చాలా చోట్ల అజిత్ సినిమా ఆల్ టైం రికార్డు ఓపెనింగ్స్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో తునివు అయితే మాస్ నంబర్స్ నమోదు చేసినట్టే అని చెప్పాలి. మరి డే 1 ఎంత అందుకుంది అనేది ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా మంజు వారియర్, అజయ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంని బోనీ కపూర్ నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు