విజయ్ సినిమాలో పూజా హెగ్డేకు భారీ రెమ్యునరేషన్.?

Published on Mar 4, 2021 1:59 pm IST

ప్రస్తుతం మన దక్షిణాదిలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. మంచి సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో కూడా పూజా ఇప్పుడు ఉంది. ఇప్పుడు పలు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఈమె లేటెస్ట్ గా కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ 65వ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే భారీ అంచనాలే సెట్ చేసుకున్న ఈ చిత్రానికి గాను పూజా గట్టి రెమ్యునరేషన్ నే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఈమె మూడున్నర కోట్లు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ఎటు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కావడం ఆమెకి కూడా పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు ఉండడంతో ఇందులో ఆశ్చర్యం లేదు.

ఇక ఈ విజయ్ 65వ బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ ను తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :