‘బాహుబలి’ ఇంటర్నేషనల్ వర్షన్‌కు మంచి రెస్పాన్స్!

baahubali11

దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో పలు హాలీవుడ్ పత్రికల మన్ననలు కూడా పొంది ప్రత్యేక విశిష్టతను సొంతం చేసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’కి ఓ ఇంటర్నేషనల్ వర్షన్‌ను రూపొందించే ఆలోచన చేశారు. ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబిల్లాన్‌తో బాహుబలి ఇంటర్నేషనల్ వర్షన్‌ను ఎడిట్ చేయించారు.

ప్రస్తుతం ఈ వర్షన్‌ను పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు ఫెస్టివల్స్‌లో ప్రైవేట్ స్క్రీనింగ్‌లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అక్టోబర్‌లో భుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దర్శకుడు రాజమౌళి కూడా ప్రత్యేకంగా హాజరుకానుండడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే చైనాలో ఈ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ఈ స్టార్ ఫిల్మ్స్‌ బాహుబలి హక్కులను సొంతం చేసుకోగా, ఇతర దేశాల్లోనూ బాహుబలి డిస్ట్రిబ్యూషన్‌కు మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇక ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా అంతర్జాతీయంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందనేది ఆసక్తికర అంశం.

Exit mobile version