“మాస్టర్” డిజిటల్ రైట్స్ వాళ్ళకే..కానీ..!

Published on Nov 28, 2020 12:00 pm IST

ఇప్పుడు మన దక్షిణాది నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఇళయ థలపతి విజయ్ హీరోగా నటించిన “మాస్టర్” చిత్రం కూడా ఒకటి. కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది.

దీనితో ఈ చిత్రానికి ఆ తర్వాత భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చాయి. కానీ మేకర్స్ అందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తాలూకా డిజిటల్ హక్కులను ఆల్రెడీ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనేశారట. అయితే ఇక్కడే ఇంకో క్లారిటీ ను చిత్ర యూనిట్ ఇచ్చారు.

డిజిటల్ హక్కులను వారికి ఇచ్చినా మొదట మాత్రం ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ అయ్యాకనే అమెజాన్ ప్రైమ్ లోకి రావడం కన్ఫర్మ్ చేసారు. సో ముందు మాస్టర్ చిత్రం డైరెక్ట్ థియేటర్స్ ఆ నెక్స్ట్ ఓటిటి. ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే అనిరుద్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :

More