మరో మైల్ స్టోన్ అందుకున్న “మాస్టర్” టీజర్.!

Published on Nov 27, 2020 9:00 am IST

ఇళయ థలపతి విజయ్ హీరోగా కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. కానీ మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కే ఎప్పటి నుంచో స్టిక్ అయ్యి ఉండడం వల్ల ఇంకా ఆలస్యం కావాల్సి వచ్చింది.

అయితే ఈ గ్యాప్ లో దీపావళి కానుకగా విడుదల చేసిన టీజర్ కు భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చింది. లైక్స్ పరంగా సెన్సేషనల్ రికార్డులు సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ మైల్ స్టోన్ ను అందుకుంది. లేటెస్ట్ గా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మరో రికార్డు సెట్ చేసింది.

అంతే కాకుండా 2.4 మిలియన్ లైక్స్ తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషనల్ రికార్దును అందుకుంది. మొత్తానికి మాత్రం మాస్టర్ టీజర్ హవా ఇంకా అలా కొనసాగుతుంది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివ్వగా విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

More