షూటింగ్ కి రెడీ అవుతున్న “మత్తు వదలరా2”?

షూటింగ్ కి రెడీ అవుతున్న “మత్తు వదలరా2”?

Published on Feb 16, 2024 10:03 PM IST

శ్రీ సింహ, సత్య ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వం లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మత్తు వదలరా మూవీ 2019 థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం కి ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని అప్పట్లో న్యూస్ వచ్చింది. అయితే ఈ చిత్రం సీక్వెల్ పై టీమ్ సన్నద్ధం అవుతోంది.

ఈ చిత్రం కి సంబందించిన షూటింగ్ ను త్వరలో మొదలు పెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా, మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వారు పార్ట్ వన్ ను నిర్మించగా, దానికి కాల భైరవ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు