శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ రిలీజ్ కి బ్రేక్ పడుతుందా.?

శంకర్ – విక్రమ్ ల ‘ఐ’ రిలీజ్ కి బ్రేక్ పడుతుందా.?

Published on Jan 8, 2015 6:02 PM IST

I

సౌత్ ఇండియన్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ శంకర్, సినిమా కోసం ఏమన్నా చేసే చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో రానున్న సినిమా ‘ఐ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చాలా రోజుల ఆలస్యం తరువాత సంక్రాంతికి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. కానీ తాజాగా ఈ సినిమాకి ఓ సమస్య వచ్చి పడింది.. దానివల్ల సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా లేదా వాయిదా పడుతుందా అనే అనుమానం అందరిలోనూ మొదలైంది.

ఇక అసలు విషయంలోకి వెళితే పిక్సర్ మీడియా వర్క్స్ వారు ఐ చిత్ర నిర్మాత అయిన ఆస్కార్ రవిచంద్రన్ కి ఒక నోటీసు పంపారు. అందులో వారి నుంచి తీసుకున్న లోన్ అమౌంట్ ని వెంటనే తిరిగి ఇవ్వాలని లేకపోతే సినిమా రిలీజ్ చెయ్యడానికి వేల్లేదని అంటున్నారు. మరి ఈ విషయం క్లియర్ అయితే గానీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని తమిళ వర్గాలు చెబుతున్నాయి.

ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా రన్ టైం 3 గంటల 8 నిమిషాలకు ఫిక్స్ చేసారు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేలా ‘ఐ’ ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. విక్రమ్ మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు