“వకీల్ సాబ్” సెకండాఫ్ లో సర్ప్రైజ్ ఇదేనేమో.!

Published on Mar 21, 2021 6:41 pm IST

ఇప్పుడు “వకీల్ సాబ్” ప్రమోషన్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రమోషన్స్ చెయ్యడం లేదు అనే ఫ్యాన్స్ కూడా చిత్ర యూనిట్ చేస్తున్న హంగామాలో బిజీ అయ్యిపోయారు. మరి పవన్ నటించిన ఈ చిత్రంపై లేటెస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు శ్రీరామ్ వేణు మరియు సంగీత దర్శకుడు థమన్ లు మాట్లాడుతూ సెకండాఫ్ లో ఒక పెద్ద సర్ప్రైజే ఉందని తెలుపుతున్నారు.

మరి ఆ ఊహించని సర్ప్రైజ్ ఏంటి అన్నదానిపై ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే అది కూడా ఖచ్చితంగా ఓ సాంగ్ కోసమే అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం కోసం ఎక్కువగా సినిమా ఆల్బమ్ కోసం మాట్లాడుతున్నపుడే చర్చ వచ్చింది. అంతే కాకుండా గత కొన్ని రోజులు కితమే ఈ చిత్రంలో పవన్ మార్క్ మంచి ఫోక్ సాంగ్ కూడా ఉందని టాక్ వచ్చింది. మరి బహుశా అదే సాంగ్ సెకండాఫ్ లో ఉంటుందా లేక వేరే ఏమన్నా ప్లాన్ చేసారా అన్నది చూడాలి. దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :