విడుదల తేదీ : అక్టోబర్ 9, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : రాయల్ చెంగప్ప, మురళీధర్ గౌడ్, అమన్ మసూద్, జను వర్మ, మరియు ఇతరులు
దర్శకత్వం : శ్రీకాంత్ కండ్రగుల
నిర్మాతలు : శశిధర్ నల్లా
సంగీతం : శిబి మ్యాథ్యూ అలెక్స్,
ఛాయాగ్రహణం : ఫర్హాన్ వడక్కం,
కూర్పు : శరత్ జే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన సినిమా మయూఖ. ఈ మూవీకి శ్రీతేజ్ ఎస్కే దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
మయూఖ (పాయల్ చెంగప్ప) హైదరాబాద్ లో
బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఉంటుంది. అయితే, మరోవైపు హైదరాబాద్ నగరంలో దారుణ హత్యలు చోటు చేసుకొంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగా నివసిస్తున్న మయూఖ (పాయల్ చెంగప్ప) ఇంటిలో అనుమానాస్పదంగా వ్యక్తి కదలికలు కనిపిస్తూ ఉంటాయి. తన ఇంటిలో తనకు తెలియకుండా ఎవరో వెంటాడుతున్నట్టు, అలాగే తనతో కలిసి ఉంటున్నట్టు అనుమానం ఉంది అని మయూఖ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కానీ, పోలీసులు ఆమె చెప్పేది నమ్మరు. కానీ.. నిజంగానే మయూఖను ఎవరో వెంటాడుతూ ఉంటారు. అసలు మయూఖను వెంటాడుతున్నది ఎవరు ?, ఇంతకీ.. మయూఖకు తెలియకుండా ఆమె ప్లాట్ లో తిష్టవేసింది ఆత్మనా? లేక మనిషా ?, ఈ మొత్తం వ్యవహారంలో వీరు అనే వ్యక్తి పాత్ర ఏమిటి ?, చివరకు పోలీసులు ఏం తేల్చారు? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
శ్రీతేజ్ ఎస్కే రాసుకున్న మెయిన్ పాయింట్ బాగుంది. ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ అండ్ సస్పెన్స్ టచ్ కూడా బాగుంది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పాయల్ చెంగప్ప పాత్ర బాగుంది. కొన్ని క్రైమ్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆమె ఆకట్టుకుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని సస్పెన్స్ సన్నివేశాల్లో అలాగే సెకండాఫ్ లో వచ్చే కీలక క్రైమ్ సీన్స్ లో కూడా పాయల్ చెంగప్ప నటన చాలా బాగుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన అమన్ మసూద్ కూడా తన నటనతో మెప్పించారు.
మరో పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మరో కీలక పాత్రలో నటించిన జాను వర్మ బాగా నటించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు శ్రీతేజ్ ఎస్కే కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా క్రైమ్ సీన్స్ ను కూడా శ్రీతేజ్ ఎస్కే చాలా బాగా పిక్చరైజ్ చేసాడు. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్‌గా సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమాలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, టెక్నికల్ వర్క్ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా సాగాలి, కానీ ఈ సినిమాలో కొన్ని క్రైమ్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. నిజానికి దర్శకుడు శ్రీతేజ్ ఎస్కే సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ.. ప్రేక్షకులు ఇన్ వాల్వ్ అయ్యేలా కనెక్ట్ కాదు.
మొత్తానికి ఈ మయూఖ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. కొన్ని చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, సినిమాలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. అదే విధంగా దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్, క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలను కూడా ఇంకా బెటర్ గా రాసుకుని ఉండి ఉంటే బాగుండేది. ముఖ్యంగా కిల్లర్ నెక్ట్స్ ఎవరిని చంపుతాడా ? అనే ఉత్కంఠను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు, ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం వెనుకబడ్డారు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు, టెక్నికల్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.
తీర్పు :
‘మయూఖ’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో.. కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని ట్విస్ట్ లు సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కాన్ ఫ్లిక్ట్ బలంగా లేకపోవడం, కొన్ని సీన్స్ ఇల్లాజికల్ గా సాగడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన క్రైమ్ తరహా చిత్రాలని ఇష్టపడేవారికి, ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా కొంతవరకు కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
