‘ధర్మన్’ రిలీజ్ ప్లాన్స్ ఛేంజ్.. ‘వారణాసి’ నెలలో?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘ధర్మన్’. ఆల్రెడీ రజినీకాంత్ నటించిన జైలర్ 2 ఇప్పుడు విడుదలకి వస్తున్న నేపథ్యంలో అభిమానులు మొదట ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇంకోపక్క ధర్మన్ షూట్ ని శరవేగంగా తలైవర్ పూర్తి చేస్తుండగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ ల కోసం కూడా ఆల్రెడీ టాక్ మొదలైంది.

ఇది వరకు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాని తీసుకొచ్చే ప్లాన్ లు ఉన్నట్టుగా వినిపిస్తే ఇప్పుడు ఇండియన్ 3 రావడం దాదాపు ఖాయం కావడంతో ధర్మన్ అక్కడ నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక ఏప్రిల్ లో భారీ సినిమా వారణాసి ఉండడంతో ఆ నెలలోనే మొదట ఓ వారం గ్యాప్ లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు ఆ క్లాష్ నుంచి నెలాఖరుకి మార్చినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనితో ‘ధర్మన్’ వారణాసి నెలకి అంకితం అయ్యింది అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా కమల్ హాసన్ నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version