భల్లాల దేవ బరువుతగ్గాడో లేదో పుకార్లకు పనిపెట్టారు.

భల్లాల దేవ బరువుతగ్గాడో లేదో పుకార్లకు పనిపెట్టారు.

Published on Oct 2, 2019 3:00 AM IST

rana

రానా దగ్గుబాటి తాజా ఫోటో ఒకటి ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో కొన్ని పుకార్లకు ఊతమిచ్చింది. దానికి కారణం ఆయన ఆ చిత్రంలో బాగా బరువుతగ్గి కనిపించడమే. గతంలోనే రానా దగ్గుబాటి ఆరోగ్యం పై అనేక పుకార్లు రావడం జరిగింది. ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రానా సర్జరీ కొరకు అమెరికా వెళ్లారని కొద్దిరోజుల క్రితం చాలా సామజిక మాధ్యమాలలో ప్రముఖంగా రాయడం జరిగింది. ఐతే ఈవిషయాన్ని రానా తండ్రి సురేష్ బాబు ఖండించడం జరిగింది.

ఈ విషయంలో వాస్తవం ఏదైనా వ్యక్తిగత గోప్యతను గౌరవించి ఆ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం తగదు. బరువు తగ్గినంత మాత్రాన ఆరోగ్య సమస్య ఉన్నట్లు ఎందుకు భావించాలి. అనేక చిత్రాలలో నటిస్తున్న ఆయన ఎదో ఒక పాత్ర కోసం ఇలా మారారు అనుకోవచ్చుగా. కాబట్టి మీడియా సంస్థలు ఈ విషయంపై అత్యుత్సహం ప్రదర్శించకుండా వదిలేయడం మంచిది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు