హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకం పై నిర్మిస్తోన్న తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమా యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రానుంది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ లో యూత్ ను ఆకట్టుకునే అంశాలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా వాస్తవిక జీవితానికి ఆధారంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ట్రైలర్ ను కట్ చేయడంతో ప్రస్తుతం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.
మొత్తానికి విజయ్ ఈ ట్రైలర్ తో తన అభిరుచిని పరిచయం చేశాడు. పెళ్లి చూపులతో యూత్ లో బలమైన ముద్ర ను వేసుకున్న విజయ్ కి ఆ ప్రయాణంలో పడిన కష్టాలు తెలుసు. అందుకే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఈ సినిమా చేస్తున్నాడట. ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. మరి దేవరకొండ మొదటి వెంచర్ తో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.
ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
