వన్ మిలియన్ వ్యూస్ సాధించిన మీకు మాత్రమే చెప్తా.

వన్ మిలియన్ వ్యూస్ సాధించిన మీకు మాత్రమే చెప్తా.

Published on Sep 8, 2019 1:11 AM IST

హీరో విజయ్ దేవరకొండ మొత్తానికి నిర్మాతగా కూడా మారిపోయాడు. తనను హీరోని చేసిన దర్శకుడిని హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోగా ఉన్న ఈ టీజర్ వన్ మిలియన్ మార్కు ను చేరుకుంది.

తరుణ్ భాస్కర్ తో పాటు మరో ఇద్దరు మిత్రుల మధ్య నడిచే కామెడీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు షమ్మీర్ సుల్తాన్ తెరకెక్కిస్తున్నారు. ప్రేమించిన వారికి తెలియకుండా చేసే చాటు మాటు వ్యవహారాలకు మొబైల్ ఫోన్ ఎలా సాక్ష్యంగా నిలుస్తుంది, దాని వలన ఎదురయ్యే పరిణామాలు హాస్యపూరితంగా చెప్పే కథే మీకు మాత్రమే చెప్తా. అనసూయ భరద్వాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు