రూమర్స్ పై సీనియర్ హీరోయిన్ సీరియస్

రూమర్స్ పై సీనియర్ హీరోయిన్ సీరియస్

Published on Mar 24, 2024 4:38 PM IST

సీనియర్ హీరోయిన్ మీనా పెళ్లికి సంబంధించిన వార్తలు గత కొన్ని నెలలుగా చాలా రకాలుగా వస్తున్నాయి. కాగా తన పెళ్లి పై జరుగుతున్న ప్రచారంపై తాజాగా మీనా స్పందించింది. ‘సోషల్ మీడియా దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాస్తే.. అందరికీ మంచిది. అసలు ‘డబ్బు కోసం ఏమైనా రాస్తారా ?, నాలా ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. వారి పై ఇలా రూమర్స్ రాయడం ఎవ్వరికీ మంచిది కాదు.

మీనా ఇంకా మాట్లాడుతూ.. ‘నా గురించే కాదు, నా పేరెంట్స్, కుమార్తె భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ప్రస్తుతానికి నాకు రెండో పెళ్లి పై ఎలాంటి ఆలోచన లేదు. ఒకవేళ ఆ ఆలోచన నాకు వస్తే, నేను స్వయంగా మీకు వెల్లడిస్తా’ అంటూ ఓ ఇంటర్వ్యూలో మీనా స్పందించారు. మీనా భర్త విద్యాసాగర్‌ మరణం మీనాను బాగా బాధ పెట్టింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు