దుల్కర్, వెంకీ సినిమా నుంచి మీనాక్షి చౌదరి రోల్ రివీల్ చేసిన మేకర్స్

దుల్కర్, వెంకీ సినిమా నుంచి మీనాక్షి చౌదరి రోల్ రివీల్ చేసిన మేకర్స్

Published on Mar 5, 2024 2:50 PM IST

మోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగు ఆడియెన్స్ కి కూడా ఎంతో దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న తాను యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అయినటువంటి వెంకీ అట్లూరితో చేస్తున్న ఇంట్రెస్టింగ్ చిత్రమే “లక్కీ భాస్కర్”. డబ్బు నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈరోజు ఆమె బర్త్ డే కానుకగా అయితే మేకర్స్ ఆమెపై ఫస్ట్ లుక్ పోస్టర్ సహా ఆమె రోల్ ని కూడా సి=రివీల్ చేశారు. మరి ఈ ఫస్ట్ లుక్ లో మీనాక్షి డీసెంట్ లుక్స్ తో ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుండగా ఆమె ఈ చిత్రంలో సుమతి అనే పాత్రలో కనిపించనున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు పరిచయం చేశారు. మరి ఈ సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు