వెబ్ సిరీస్ షూటింగ్ లో సీనియర్ హీరోయిన్ !

Published on Sep 12, 2019 11:14 pm IST

సీనియర్ హీరోయిన్ మీనా ఓ వెబ్ సిరీస్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ని ట్రెండ్ లౌడ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా, దర్శకుడు వివేక్ కుమారన్ తెరకెక్కిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ షూట్ లో మీనాతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇక 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా కొనసాగిన మీనా మొదటిసారి ఓ వెబ్ సిరీస్ నటిస్తోంది. ఆయితే ఈ వెబ్ సిరీస్ లో మీనా క్యారెక్టర్ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. మీనా ఈ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుందట, అలాగే ఆమె పాత్ర చాల కామిక్ గా ఉండనుందని తెలుస్తోంది.

కాగా గతంలో మీనా నటించిన చాలా సినిమాలు చూస్తే.. మీనా మంచి కామెడీ టైమింగ్ కలిగిన నటి అని అనిపిస్తోంది. ఇక కొన్ని తెలుగు, తమిళ సీరియల్స్ కూడా నటించారు మీనా. అలాగే ఈ మధ్య కాలంలో దృశ్యం, మామ మంచు అల్లుడు కంచు వంటి తెలుగు చిత్రాలతో పాటు మలయాళ చిత్రాలలో గృహిణిగా వయసుకు తగ్గ పాత్రలు చేస్తున్నారు. తాజాగా మమ్ముటి హీరోగా తెరకెక్కిన “షై లాక్” చిత్రంలో నటించారు.

సంబంధిత సమాచారం :

X
More