ఫుల్ స్వింగ్ లో ‘మెగా 158’.. మరి ‘విశ్వంభర’ ఏమైనట్టు?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సెన్సేషనల్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఈ ఏడాదిలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ షురూ చేసేసారు. భారీ లెవెల్లో లాంచ్ అయ్యిన ఈ సినిమా ఆ తర్వాత రోజు నుంచే షూటింగ్ మొదలు పెట్టుకొని ఫుల్ స్వింగ్ లో ఇప్పుడు కొనసాగుతుంది.

అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అసలు ఈ రెండిటికంటే ముందే మొదలై పూర్తి చేసుకున్న భారీ ఫాంటసీ సినిమా ‘విశ్వంభర’ అనే సినిమా ఒకటుందని ఇపుడు ఫ్యాన్స్ మరిచిపోయేలా పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా ఈ సినిమా విడుదల కాకపోవడం కనీసం విడుదల ఎప్పుడు అనేది కూడా క్లారిటీ లేకపోవడం బాధాకరం. దీనితో ఇంత ఆలస్యం అవుతున్న ఈ ప్రాజెక్ట్ క్రమంగా తగ్గిపోతుంది.

ఆల్రెడీ సమ్మర్ రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు కానీ ఇప్పుడు చూస్తే ఈ రేస్ లో వచ్చే పరిస్థితి అస్సలు లేదు. కానీ కనీసం విడుదల ఎప్పుడు అనేది అయినా క్లారిటీ ఇస్తే అప్పటికి ఫ్యాన్స్ కూడా ప్రిపేర్డ్ గా ఉంటారు. మరి సినిమా విడుదల ఇంతలా ఆలస్యం అవుతుండడానికి కారణం ఏంటి అనేది రివీల్ కావాల్సి ఉంది.

Exit mobile version