డిలీషియస్ ఓటిటి డెబ్యూ ఇస్తున్న మెగా డాటర్.!

డిలీషియస్ ఓటిటి డెబ్యూ ఇస్తున్న మెగా డాటర్.!

Published on Feb 25, 2024 11:00 AM IST

మన తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా ఇప్పుడు ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందో. మరి తెలుగులోనే ఎన్నో వినూత్న షోలు సినిమాలతో అలరిస్తూ వస్తున్నా ఆహా లో హిట్ షో చెఫ్ మంత్ర కూడా ఒకటి. రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇపుడు మూడో సీజన్లోకి వచ్చింది.

మరి మొదటి రెండు సీజన్లను వరుసగా శ్రీముఖి, లక్ష్మి మంచు లు హోస్ట్ గా చేయగా ఈసారి మెగా డాటర్ నిహారిక కొణిదెల అయితే హోస్ట్ గా పరిచయం కాబోతున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఆహా తో ఇప్పుడు నిహారిక ఓటిటి డెబ్యూ ని ఇస్తుండగా మేకర్స్ ఈ సీజన్ ని అయితే మరింత ఆసక్తిగా మరింత ఫన్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుపుతున్నారు.

ఇక ఈ షో ఈ మార్చ్ 3 నుంచి ఆహా లో స్టార్ట్ కానుండగా మొత్తం 8 ఎపిసోడ్స్ సీజన్ గా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇది వరకే పలు షోస్ కి హోస్ట్ గా నిహారిక సూపర్ సక్సెస్ అయ్యింది. మరి ఈ డిలీషియస్ షోకి హోస్ట్ గా ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు