ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అద్భుతమైన పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. కాగా మెగా ఫ్యామిలీలో కూడా ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. రామ్ చరణ్ తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ‘మనకు అన్నీ ఇచ్చేసిన వ్యక్తి. అని ‘సైరా’తో సూపర్ హిట్ అందించినందుకు థాంక్యూ డాడి’ అని చిరుకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రామ్‌చరణ్, తన తండ్రి తనను ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకున్న ఫొటోలను ట్విటర్ లో పోస్ట్ చేశారు.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించారు. అలాగే ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటించారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. సినిమా రిపోర్ట్స్ ను బట్టి బ్లాక్ బస్టర్ అంటున్నారు.
