టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులు !

టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులు !

Published on Nov 9, 2018 8:53 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం ‘వినయ విధేయ రామ’ టీజర్ ఈ రోజు విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈటీజర్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:25 గంటలకు ఈ టీజర్ విడుదల కానుంది. ఇటీవల క్లాస్ టైటిల్ తో రామ్ చరణ్ మాస్ లుక్ లో వున్నా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి చిత్రం ఫై అంచనాలు పెంచేలా చేశారు. ఇక ఈ టీజర్ కూడా మాస్ ఎలిమెంట్స్ తో ఉండనుందని సమాచారం.

బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా లో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు