విశ్వంభర”లో మెగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న అంశం

విశ్వంభర”లో మెగా ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్న అంశం

Published on Feb 27, 2024 12:01 PM IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “విశ్వంభర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు ప్లానింగ్ ప్రకారం ఒకో షెడ్యూల్ కంప్లీట్ చేస్తుండగా మళ్ళీ చాలా కాలం తర్వాత ఓ స్ట్రైట్ సినిమా మెగాస్టార్ చేస్తుండడంతో దీనిపై హైప్ మెగా ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ చిత్రం విషయంలో రీసెంట్ గా వచ్చిన ఓ బజ్ అందరిలో ఆసక్తి రేపింది.

ఈ చిత్రంలో చిరు ఒక ఓల్డ్ గెటప్ లో కనిపిస్తారు అని టాక్ రాగ ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ లో వీర్ల గా మారింది.. చిరు గతంలో కూడా అది కూడా తన యంగ్ ఏజ్ లోనే ఈ తరహా పాత్రలు చేశారు. ఒక స్నేహం కోసం, శ్రీ మంజునాథ లాంటి చిత్రాల్లో ఓల్డ్ లుక్ లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన చిరు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత డ్యూయల్ షేడ్ లో కనిపించనుండడం అనే టాక్ తో ఇపుడు మరోసారి మెగా ఫ్యాన్స్ ని ఈ అంశం బాగా ఎగ్జైట్ చేసింది. దీనితో విశ్వంభర లో చిరు ఎలా కనిపిస్తారో అని వారు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు