మెగా ఫ్యాన్స్ సంబరాలు.!

మెగా ఫ్యాన్స్ సంబరాలు.!

Published on Jan 26, 2024 7:15 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు “విశ్వంభర” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలోనే మెగా ఫ్యాన్స్ మంచి హై లో ఉండగా ఇదే హై లో రీసెంట్ గా చిరు పద్మవిభూషణ్ కి ఎంపిక అవుతారు అనే టాక్ కూడా మెగా ఫ్యాన్స్ కి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు అఫీషియల్ గా దేశ ప్రభుత్వం చిరు పేరుని ఖరారు చేయడంతో ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

చిరు కష్టానికి సేవకు ఇది ఖచ్చితంగా వచ్చి తీరాల్సిన గౌరవం అని ఆయన ఇందుకు ఎంతో అర్హుడు అని ఈ విషయంలో మాత్రం అభిమానులు ఎంతో భావోద్వేగం లోనవుతున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుండగా ఇవాళ బయట కూడా మెగా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే మరోసారి మెగా అభిమానులు మెగా కుటుంబం కూడఈ హై మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు