మెగాస్టార్ చిరంజీవి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ సినిమా అక్టోబర్ 16న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ఎప్పటిలానే రిలీజ్ రోజు రాత్రే ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ షో వేయనున్నారు. మెగా ఫ్యాన్స్ కళామందిర్ వారితో కలిసి ఒక చారిటీ కోసం మూసాపేట్ లోని శ్రీ రాములు థియేటర్ లో మొదటి బెనిఫిట్ షోని వేయనున్నారు. ఈ బెనిఫిట్ షోని ఇప్పటివరకూ ఎన్నడూ జరగని రీతిలో చెయ్యాలని మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం ప్లాన్ చేసారు అనే విషయానికి వస్తే.. మొట్ట మొదటిసారిగా అర్థరాత్రి ఫాన్స్ షో దగ్గర జరిగే హంగామాని ప్రముఖ న్యూస్ చానల్ లో లైవ్ ఇవ్వనున్నారు. ఇలా ఫ్యాన్స్ షో దగ్గద హడావిడిని లైవ్ ఇవ్వడం ఇదే ప్రధమం అని చెప్పాలి. అలాగే అవార్డ్స్ వేడుకలాగా రెడ్ కార్పెట్ చేసి, అక్కడ ఒక కళామందిర్ స్టేజ్ ని సెట్ చేసి వచ్చే ప్రతి సెలబ్రిటీని మాట్లాడించేలా ఓ యాంకర్ ని కూడా సెట్ చేయనున్నారు. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం శ్రీ రాములు థియేటర్ కి డైరెక్టర్ శ్రీను వైట్లతో పాటు దిల్ రాజు, సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్, నాగ చౌర్య, నవదీప్ లాంటి హీరోస్ హాజరు కానున్నారు. వీరితో పాటు రకుల్ మరికొంతమంది స్టార్స్ ని ఈ షోకి తీసుకొచ్చే పనిలో మెగా ఫాన్స్ ఉన్నారు.
మరి మునుపెన్నడూ లేని విధంగా, చాలా గ్రాండ్ గా ఫాన్స్ షోని ప్లాన్ చేస్తున్న ఈ బ్రూస్ లీ సినిమా ఓవరాల్ గా అభిమానులను, తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుంది అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే.
