“విశ్వంభర” విషయంలో మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ.!

“విశ్వంభర” విషయంలో మెగా ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ.!

Published on Jan 16, 2024 1:01 PM IST


మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు తన కెరీర్ లో 156వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనిని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా ఈ సినిమా విషయంలో మొదటి నుంచి భారీ అంచనాలు పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్ “విశ్వంభర” అనేది అధికారికంగా మేకర్స్ నిన్ననే రివీల్ చేశారు.

అయితే ఈ టైటిల్ అనౌన్సమెంట్ వీడియో చూసాక మెగా ఫ్యాన్స్ కి మాత్రం మైండ్ బ్లాక్ అయ్యింది. చిరంజీవి నుంచి ఏ తరహా సినిమాలు చూడాలి అనుకుంటున్నారో తన రేంజ్ ఏమిటో చూపించే సినిమా ఫైనల్ గా మళ్ళీ చిరంజీవి చేస్తున్నారని ఈ టైటిల్ గ్లింప్స్ చూసాక అనుకుంటున్నారు. ఈ అనౌన్సమెంట్ తో మాత్రం మెగా ఫ్యాన్స్ లో ఒక తెలియని నూతన ఉత్సాహం అయితే నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు