“గేమ్ చేంజర్” అప్డేట్ పై మెగా హీరో కామెంట్స్.!

“గేమ్ చేంజర్” అప్డేట్ పై మెగా హీరో కామెంట్స్.!

Published on Feb 20, 2024 4:02 PM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “గేమ్ చేంజర్” విషయంలో మాత్రం మెగా ఫ్యాన్స్ కి చాలా డిజప్పాయింటింగ్ గా ఉన్నారని చెప్పాలి. సినిమా స్టార్ట్ చేసి ఎన్నో ఏళ్ళు అయ్యింది. పైగా షూటింగ్ కూడా కొనసాగుతుంది కానీ ఇప్పుడు వరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం అరకొర గానే కనిపిస్తాయి. దీనితో ఎప్పుడు నుంచో గేమ్ చేంజర్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరి ఈ అప్డేట్ కోసం ప్రశ్న మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ వరకు కూడా వెళ్ళింది. మరి తన లేటెస్ట్ చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్” ప్రమోషన్స్ లో మాట్లాడుతూ తాను కూడా గేమ్ చేంజర్ అప్డేట్ కోసం అడుగుతూ ఉంటానని ఇవాళే షూటింగ్ స్టార్ట్ అయ్యినట్టు ఉంది ఇవాళ ఉదయమే కాల్ కూడా మాట్లాడానని అతి త్వరలోనే గేమ్ చేంజర్ అప్డేట్స్ వరుసగా వస్తాయని అనుకుంటున్నాను అని వరుణ్ తేజ్ తెలిపారు. దీనితో గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఉన్నారో అర్ధం చేసుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు