ఈ దసరాకి ఆ మెగా హీరో సినిమా..!

Published on May 29, 2020 2:00 am IST

ప్రస్తుతం లాక్ డౌన్ కారణం వలన ఇప్పటికే విడుదల కావాల్సిన ఎన్నో చిత్రాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి వాటిలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సోలో బతుకే సో బెటర్” అనే సినిమా కూడా ఒకటి. ఈ మే 1 వ తారీఖుకే ముహూర్తం కుదుర్చుకున్న ఈ చిత్రం ఆగిపోవాల్సి వచ్చింది.

అయితే ఈ గ్యాప్ లో ఈ చిత్రాన్ని మేకర్స్ యూత్ కి బాగా కనెక్ట్ చెయ్యడంతో మంచి పాజిటివ్ హైప్ ఈ చిత్రంపై నమోదు అయ్యింది. అయితే మే లోనే వచ్చేయాల్సిన ఈ సినిమా కోసం మేకర్స్ ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం మరో మంచి టైం కోసం చూస్తున్నారట. అందులో భాగంగా ఈ చిత్రాన్ని దసరా రేస్ లో ఉంచాలని అదే సరైన సమయం అని వారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు సుబ్బు టాలీవుడ్ కు పరిచయం అవుతుండగా ఎస్ ఎస్ థమన్ స్వరాలు సంగీతం ఇస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More