గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో సినిమా ?

గీతా ఆర్ట్స్ బ్యానర్లో మెగా హీరో సినిమా ?

Published on May 29, 2018 2:51 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. ఈ చిత్రాన్ని ఇటీవలే ‘ఛలో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుములు డైరెక్ట్ చేస్తారని కూడ అంటున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే చిత్రం ప్రారంభమవుతుందని అంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంచితే ధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రాన్ని చేస్తూనే త్వరలో కిశోర్ తిరుమలతో కొత్త చిత్రాన్ని ప్రారంబించే యోచనలో ఉన్నారు.

తాజా వార్తలు