సునీల్ హీరోయిన్ తో మెగా హీరో రొమాన్స్?

sai-dharam-tej
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో ఈ ఏడాది హిట్ అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. అందులో ఒకటి ‘తిక్క’, రెండవది ‘సుప్రీమ్’. తిక్క సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది.సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. సినిమా మొదలవ్వగానే లారిస్సా బొనెసి, అమ్రిత దాస్గుప్తలను హీరోయిన్స్ గా ఫైనలైజ్ చేసారు.

తాజాగా ఈ చిత్ర టీం నుంచి అందిన సమాచారం ప్రకారం.. తిక్క సినిమా నుంచి అమ్రిత దస్గుప్త తప్పుకోగా ఆ ప్లేస్ లో బాలీవుడ్ బ్యూటీ మన్నార చోప్రాని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. మన్నారా చోప్రా ప్రస్తుతం సునీల్ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ హీరోయిన్ మార్పు పై అధికారిక ప్రకటన వెలువడనుంది. తిక్క సినిమాని రోహిన్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

Exit mobile version