కోలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మెగా హీరోయిన్.!

కోలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మెగా హీరోయిన్.!

Published on Feb 13, 2024 12:09 PM IST


మెగా డాటర్ గా టాలీవుడ్ కి పరిచయం అయ్యిన యంగ్ నటి నిహారిక కొణిదెల కాస్త టైం తీసుకొనే కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలే చేస్తూ వస్తుంది. మరి తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడా సినిమా ఎంట్రీ ఇచ్చిన తాను ఇప్పుడు తమిళ్ లో రెండో సినిమా అయితే స్టార్ట్ చేసింది. ఇది వరకే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో ఓ సినిమా చేయగా ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నిహారిక ఇప్పుడు ఫిక్స్ అయ్యింది.

“మద్రాస్ కారన్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం నిన్ననే ముహూర్త కార్యక్రమాలతో స్టార్ట్ కాగా ఇప్పుడు రెగ్యులర్ గా షూటింగ్ ని స్టార్ట్ చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని “సీమరాజా”, “వీవీఎస్” ఫేమ్ దర్శకుడు పొన్రం వీవీఎస్ తెరకెక్కిస్తుండగా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు