మెగా హీరో మొదటి సినిమాకే బడ్జెట్ మించిపోతుందిగా…?

Published on Feb 23, 2020 12:54 am IST

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో ఉప్పెన అనే సినిమా ద్వారా వెండి తెర మీదకు తెరంగ్రేట్రం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం. కాగా ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కాగా అసలు విషయం ఏంటంటే ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త ప్రస్తుతానికి ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ సృష్టిస్తుంది.

కాగా ఈ చిత్రానికి కేటాయించిన డబ్బు కంటే కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందని సమాచారం. దానికి కారణం లేకపోలేదు. ఈ చిత్రంలో కొన్ని ఉత్తమ విజువల్స్ ఉండనున్నాయని, అందుకు నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని సమాచారం.

సంబంధిత సమాచారం :

X
More