తన డైరెక్టర్స్ ను కన్ఫామ్ చేసేసిన మెగాస్టార్.!

Published on Sep 24, 2020 9:05 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం వచ్చే రెండు నెలల్లో తిరిగి పునః ప్రారంభం కానుండగా దీని తర్వాత కూడ చిరు పలు చిత్రాలను లైన్ లో పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో తెలిసిందే అయినా ఈ చిత్రాలకు సంబంధించి మెగాస్టార్ మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేసేసారు.

తాను లూసిఫర్ మరియు వేదాళం రెండు చిత్రాలు రీమేక్ చేయనున్నానని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా ఖరారు చేసేసారు. అంతే కాకుండా లూసిఫర్ రీమేక్ ను వివి వినాయక్ దర్శకత్వం వహించనుండగా వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ టేకప్ చేయనున్నారట. అయితే లూసిఫర్ రీమేక్ నుంచి యంగ్ డైరెక్టర్ సుజీత్ ఎందుకు తప్పుకున్నాడో కూడా వివరణ ఇచ్చారు. సుజీత్ తన వివాహ అనంతరం ఈ చిత్రం స్రిప్ట్ పై సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయానని తప్పుకున్నట్టుగా తెలిపారు.

సంబంధిత సమాచారం :

More