మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!

మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!

Published on Aug 22, 2026 5:59 PM IST

Chiranjeevi-and-Srikanth-Od

నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ నుంచి అనేకమంది నిర్మాతలు, దర్శకులు తమ బెస్ట్ విషెస్ ని అందించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి సెట్ చేసుకున్న లైనప్ లో ఓ సినిమా నిలిచిపోయింది అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి. అదే యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదల కాంబినేషన్లో అనౌన్స్ చేసిన సినిమా.

నిజానికి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబి కాంబినేషన్లో చేస్తున్న సినిమా కంటే ముందే శ్రీకాంత్ సినిమా అనౌన్స్ అయ్యింది. కానీ మధ్యలో ఈ సినిమా ఎంటర్ కావడంతో చిరంజీవి కూడా ఈ సినిమానే ముందు స్టార్ట్ చేయడంతో శ్రీకాంత్ తో సినిమాను ఏమైనట్టు అని చాలామంది అనుకున్నారు.

కానీ ఫైనల్ గా నేడు మెగాస్టార్ బర్తడే రోజు శ్రీకాంత్ ఓదెల తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి టీ – రెక్స్ అంటూ ఎలివేషన్ ఇచ్చి తనతో సినిమా మొదలుపెట్టేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నానని అసలు విషయం రివీల్ చేశాడు. దీనికి మెగాస్టార్ కూడా రిప్లై ఇచ్చారు. సో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎక్కడ నిలిచిపోలేదు ఇంకా ఆన్లోనే ఉందని ఒక క్లారిటీ అయితే అందరికీ వచ్చేసింది. ఇక ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

తాజా వార్తలు