‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేస్తోంది..!

Mana-Shankara-Vara-Prasad-G (1)

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి.

అయితే, తాజాగా ఈ సినిమా నుండి మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ చిత్రం నుండి బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌గా ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’కు సంబంధించిన అప్డేట్‌ను ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ అప్డేట్‌ను డిసెంబర్ 26న ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

దీంతో ఈ మెగా విక్టరీ మాస్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఈ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో రోల్ చేస్తుండగా స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version