యాక్షన్ మోడ్ లో మెగాపవర్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’

యాక్షన్ మోడ్ లో మెగాపవర్ స్టార్ ‘గేమ్ ఛేంజర్’

Published on Feb 15, 2024 10:04 PM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం రేపటి నుండి హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో తాజా షెడ్యూల్ జరగనుండగా ఇందులో యువ ఫైట్ మాస్టర్స్ అన్బు అరివు నేతృత్వంలో భారీ యాక్షన్ ఫైట్ చిత్రీకరించనున్నారట. ఇక ఈ ఏడాది గేమ్ ఛేంజర్ ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా ఈ మూవీలో సునీల్, ఎస్ జె సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు