ఎమోషనల్ సీన్స్ లో ‘మెగాస్టార్ – చరణ్’ !

ఎమోషనల్ సీన్స్ లో ‘మెగాస్టార్ – చరణ్’ !

Published on Mar 8, 2021 8:00 AM IST

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ నిన్న ఖమ్మంలోని ఇల్లెండులో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ఈ షెడ్యూల్ మార్చి 15 వరకూ కొనసాగుతుంది. అయితే 11 నుండి చరణ్ – చిరు కాంబినేషన్ లోని ఎమోషనల్ సిన్స్ ను షూట్ చేయబోతున్నారట. నిజానికి ఈ సీన్స్ ను గత నెలలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నా.. కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ అయింది.

ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడు. ఇక మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల ఈ చిత్రంలో చూపించబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మెగాస్టార్ ఈ సినిమా కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు