మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా షూటింగ్ మొన్నటి నుండి మొదలైన సంగతి తెలిసిందే. కాగా ఫస్ట్ షెడ్యూల్ లో కొరటాల కొన్ని ఎమోషనల్ సీన్స్ ను షూట్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ లో వచ్చే ఈ సీన్స్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతాయట. ఈ చిత్రం కోసం మెగాస్టార్ బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు.
కాగా ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ లో ఓ టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో స్టెప్స్ వేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక జనవరిలో మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.


